WGL: పవిత్ర రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు WGL CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇవాళ CP మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని అన్ని ఈద్గాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రార్థనలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని CP పేర్కొన్నారు.