ADB: బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన రంజాన్ పండుగలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడం ద్వారా సామాజిక సౌభ్రాతృత్వం మరింత బలపడుతుందని తెలిపారు.