JGL: రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రంజాన్ పండుగ సందర్భంలో ధర్మపురి పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.