NGKL: చారకొండ మండలం సిర్సనగండ్ల లో మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఈనెల 26న జరిగే సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.