TG: హైదరాబాద్ జియాగూడలో సమోసా తయారీ కేంద్రంపై కుల్సుంపురా పోలీసులు, H-FAST బృందం దాడులు చేశారు. FSSAI, ట్రేడ్ లైసెన్స్ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నారని తెలిపారు. తయారీ కేంద్రంలో పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలను సీజ్ చేసి, 50 కిలోల మైదా, 2000 సమోసా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు.