‘ధురందర్’ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదని, చిత్ర నిర్మాణ ప్రక్రియను, ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందని ఆయన అన్నాడు. భవిష్యత్తులో వచ్చే కొత్త తరం దర్శకులకు ఈ చిత్రం బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని RGV పేర్కొన్నాడు. తన ‘సత్య’ చిత్రానికి ఇది 10 రెట్లు మెరుగైన వెర్షన్ అని ఆయన ప్రశంసించాడు.