KRNL: ఆదోని నియోజకవర్గంలో రౌడీయిజం, గూండాయిజం చేస్తూ.. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే సహించేదిలేదని MLA పార్థసారథి అన్నారు. ఇటీవల గణేష్ సర్కిల్లో ఓ వ్యక్తి చేతిలో దాడికి గురైన మెడికల్ దుకాణం యజమాని రాఘవేంద్రను MLA పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఉపేంద్ర, కాలనీకి చెందిన కూటమి నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.