‘ధురంధర్ 2’ మూవీ విడుదలైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. భారత్లో రూ.267 కోట్లు, ఓవర్సీస్లో రూ.64 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ప్రివ్యూస్తో రూ.51కోట్లు, తొలిరోజు రూ.121 కోట్లు, రెండోరోజు రూ.96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పింది. మరో 2 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది.