ASF: రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపులపై స్పష్టత లేదని సిర్పూర్ MLA హరీష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఇందిర గిరి జలవికాసం, సోలార్ నిధులు పంపు సెట్లపై బడ్జెట్లో కేటాయించినట్లు ప్రకటించి ఇవ్వలేదు. మళ్లీ ఈ బడ్జెట్లో కూడా ప్రకటించారన్నారు. రాష్ట్ర పద్దులపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభిస్తే స్వాగతిస్తామన్నారు.