E.G: కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలోని నెహ్రూనగర్ ఈద్గా, సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ కృపతో అందరి జీవితాల్లో సుఖశాంతులు కలగాలని కోరారు.