TG: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో రేపు జమ కానున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.