ELR: ముసునూరులో జాబ్ మేళా పోస్టర్ను మంత్రి పార్థసారథి శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 25న నూజివీడు పట్టణంలోని శారద డిగ్రీ కళాశాల ఆవరణంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు, 925 మంది అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.