ELR: గ్రామ సీమలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో మండల ప్రజా పరిషత్తు అధికార్లు, పాలకవర్గ సభ్యులు పాత్ర కీలకం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం ముసునూరు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.