కృష్ణా: విశ్వశాంతిని కోసం శ్రీమన్నారాయణ మహా యజ్ఞం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజన్ జీయర్ స్వామి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 19-29 తేదీల్లో శ్రీమన్నారాయణ మహా యజ్ఞం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.