AKP: నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. శుక్రవారం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, జిల్లా నేత అప్పలరాజు నక్కపల్లి ఆర్.ఆర్. కాలనీలో పర్యటించి నిర్వాసితులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారన్నారని ప్రశ్నించారు.