MNCL: చెన్నూర్ మండలంలో శుక్రవారం ఏకకాలంలో సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నట్లు తెలిపారు. దాడులలో పట్టుబడ్డ మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ అధికారులకు పట్టుబడ్డ ట్రాక్టర్లు అప్పగిస్తామని సిఐ బన్సీలాల్ పేర్కొన్నారు.