KRNL: కోసిగిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్పాస్ నిర్మాణంతో పాటు రాయలసీమ, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ టీడీపీ నాయకులు కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజును కలిశారు. అలాగే స్థానిక రవాణా సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. సమస్యలను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.