TPT: ఏపీ సిఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు రానునున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో పారిశుధ్యం ఏర్పాట్లను కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. రోడ్లపైన ఎటువంటి గుంతలు లేకుండా చూడాలని డివైడర్ల మధ్యలో మొక్కలు కత్తిరించాలని సూచించారు. రోడ్ల పక్కన ఎటువంటి తోపుడు బండ్లు, దుకాణాలు పెట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.