VZM: బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జిల్లా రెవిన్యూ అధికారి ( RDO ) రామ్మోహనరావు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 17వ తేదీతో మున్సిపల్ పాలకవర్గం పదవికాలం ముగిసిన నేపథ్యంలో పాలన కోసం ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ మేరకు ఇకపై మున్సిపల్ అభివృద్ధి పనులు ప్రత్యేక అధికారి ఆమోదంతో జరగనున్నాయి.