కృష్ణా: పామర్రు పరిధిలోని అయినంపూడిలో గంగానమ్మ గుడి సమీపంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శుక్రవారం నిరసన చేపట్టారు. ఆక్రమణను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దళితుల కులదైవమైన గంగానమ్మ గుడిని తొలగిస్తుండగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై చర్యలు ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ వచ్చేవరకు వెళ్లేది లేదంటూ బైఠాయించారు.