ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, రమాదేవి దంపతులు శుక్రవారం ఉదయం అక్కమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ స్వగృహం నుంచి అమ్మవారి కలశంతో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.