SDPT: బెజ్జంకి మండలంలో ఆశా వర్కర్ల ఆందోళన కొనసాగుతుంది. గత పది రోజులుగా జీతాలు రాకపోవడంతో పాటు మూడు నెలల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం విధులకు హాజరుకాకుండా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పోలీసులు జోక్యం చేసుకుని పలువురు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని ముందస్తుగా పోలీస్ స్టేషన్కు తరలించారు.