GNTR: కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం భారీ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుందని వివరించారు. గ్రూప్-1, 2, పోలీస్, విద్య, పరిశ్రమల విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.