కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌కు నామినేషన్ల గడువుకు 3 రోజులు మాత్రమే ఉండగా, నిన్న రాత్రి 37 మందితో కూడిన తుది జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 140 స్థానాలకు గానూ కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీ చేయనుండగా, సీపీఎం నుంచి బయటకు వచ్చిన ముగ్గురు రెబల్ నేతలకు మద్దతు ఇస్తోంది.