MBNR: తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప ఈద్గాగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్లో గల వక్ఫ్-ఎ-రహ్మనియా వద్ద ముడా నిధులు రూ.20 లక్షలతో కొత్తగా ప్రవేశ ద్వారం, ఈద్గా పేరు బోర్డులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి, ముస్లిం సోదరుల చేత ఉపవాస దీక్షలు విరమింపజేశారు.