తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ (CMKCR) వర్చువల్‌గా ప్రారంభించారు.రాష్ట్రంలో పేద విద్యార్థులకు న్యాయం చేయాలని 9 మెడికల్ కాలేజ్‌లను సీఎం ప్రారంభించినట్లు మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) తెలిపారు.గతంలో 8 మెడికల్ కళాశాలను ప్రారంభించిగా ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసినట్లు ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలించాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్, పారా మెడికల్ (Para medical) కోర్సులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖ మంత్రికి సూచించారు. పారా మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలతో పేదలు దోపిడీకి గురికాకుండా ఉంటారని సీఎం చెప్పారు.
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం(Khammam), జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CMKCR) మాట్లాడుతూ.. దేశవైద్యరంగంలో ఇది సరికొత్త చరిత్ర అని కేసీఆర్ చెప్పారు. కొత్తగా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 85 శాతం లోకల్ విద్యార్థులకే సీట్లు ఇస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు కాలేజీల్లో ఉండి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పోయినేడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 9 కాలేజీలను ప్రారంభించింది. ఒక్కో కాలేజీలో వంద సీట్ల చొప్పున 900 ఎంబీబీఎస్ సీట్లు (MBBS seats) ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.