AP: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేస్తుందని MLA జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. ఉగాది కానుకగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం హర్షణీయమన్నారు. యువగళం హామీల మేరకు ఇప్పటివరకు 6,25,300 ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.