ప్రకాశం: కనిగిరి మండలం నల్లారెడ్డిపల్లిలో బుధవారం పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన విషయం విధితమే. జిల్లా జీఎంపీఎస్ ఉపాధ్యక్షులు ఖండే బాలకృష్ణ గురువారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతి చెందిన గొర్రెల పెంపకం దారులకు ఆర్థిక సహకారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీవన ఆధారం కోల్పోయిన గొర్రెల పెంపకం దారులకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు.