MDK: ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు మేలు జరుగుతుందని సుమారు 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో రైతు మేళాలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు తుమ్మల నాగేశ్వరరావు స్ఫూర్తి అని పేర్కొన్నారు. సాగు కోసం రెండో లైన్ డ్రిప్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.