ASF: కాగజ్ నగర్ సర్ సిల్క్ కాలనీలో జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను గురువారం నిర్వహించారు. జూనియర్, యువకుల విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు మార్చి 22 నుంచి 24 వరకు హైదరాబాద్ షేక్పేట్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. నిర్వాహకులు క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.