»Chandrababus Signature At 13 Places In That Scam Cid Shocking Report
CID: ఆ స్కామ్‌లో 13 చోట్ల చంద్రబాబు సంతకం..సీఐడీ షాకింగ్ రిపోర్ట్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసినట్లు ఓ రిపోర్ట్‌ను సీఐడీ డీజీ సంజయ్ వెల్లడించారు. ఈ కేసులో రూ.241 కోట్లను నేరుగా ఓ కంపెనీకి మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ (Skill Developement Scam)లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు గురించి సీఐడీ (CID) అదనపు డీజీ సంజయ్ (DG Sanjay) కీలక విషయాలను వెల్లడించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐడీ రిపోర్ట్‌ను వివరించారు. కార్పోరేషన్ ఏర్పాటు చేసే విధానంలో సరైన నియమాలు పాటించలేదన్నారు. గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించి ఆ డిపార్ట్మెంట్ నేరుగా చంద్రబాబుతో సంప్రదించేలా ప్లాన్ వేసినట్లు తెలిపారు.
జీవోలో 13 చోట్ల టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు సంతకాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ అనుమతికి, కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన సంతకమే ఉందని వెల్లడించారు. సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్ల (Skills centres)ను ఏర్పాటు చేయాలని ఎంవోయూ (MOU)లో అస్సలు లేదన్నారు. టీడీపీకి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన ఆడిటర్‌ను కార్పోరేషన్ ఆడిటర్ (Corporation Auditor)గా నియమించడం ఏంటని ప్రశ్నించారు.
కేబినెట్ (Cabinet) ఆమోదంతో కార్పోరేషన్ (Corporation) ఏర్పాటు కాలేదన్నారు. రూ.241 కోట్లు నేరుగా ఓ కంపెనీకి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు మళ్లినట్లు వెల్లడించారు. కార్పోరేషన్ నుంచి కొంత నగదు ఇతరుల అకౌంట్లలోకి వెళ్లినట్లు సీఐడీ డీజీ (CID DG Sanjay) తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (Skill Developement Scam) కేసులో తమ రిమాండ్‌లో ఉన్న కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ కార్పోరేషన్ ద్వారా హవాలా నిధులు దారి మళ్లినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఏ37గా ఉన్న చంద్రబాబును ఏ1గా పెట్టడంలో తప్పేమీ లేదన్నారు. 13 చోట్ల సంతకాలు చేసిన చంద్రబాబును ఏ1గా పెట్టడంతో సీఐడీ దురుద్దేశ్యం లేదని, ఇది ఏపీ ప్రజలు గుర్తించుకోవాలని డీజీ సంజయ్ తెలిపారు.