AP: మాజీ సీఎం జగన్పై షర్మిల హద్దులు మీరి మాట్లాడారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ మండిపడ్డారు. షర్మిల, సునీత వైఎస్ కుటుంబ గౌరవాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.236 కోట్లు విడతలవారీగా షర్మిలకు జగన్ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే షర్మిల ఉద్దేశమని విమర్శించారు. ఎప్పటికైనా షర్మిల, సునీతను చంద్రబాబు మోసం చేస్తారని పేర్కొన్నారు.
Tags :