పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్, గ్యాస్ సమస్యలు మన ఇంటిదాకా వచ్చాయి. అందుకే.. ఇంధన క్రమశిక్షణ ఇప్పుడు మనందరికీ అవసరం. ప్రతి బొట్టునూ జాగ్రత్తగా వాడుకుందాం. చీటికిమాటికీ కార్లు, బైక్లు బయటకు తీయడం తగ్గించాలి. గ్యాస్, విద్యుత్ వాడకం కూడా తగ్గిద్దాం. కూరగాయలు, వంట నూనెల ధరలు పెరగడంతో.. ఇంట్లో ఆహార వృథా అరికట్టాలి.