ఉగాది పండుగ వేళ నటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు. భవిష్యత్లో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని తెలిపాడు. పండుగని పురస్కరించుకుని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ అంశాన్ని వెల్లడించాడు.