రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధురంధర్ ది రివెంజ్’కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తెలుగు వెర్షన్ విడుదలకు కూడా రంగం సిద్ధం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 21 నుంచి తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని డబ్బింగ్ పనుల కారణంగా తెలుగు విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే.