CTR: సదుం మండలం పచ్చార్ల వంకపై గత ప్రభుత్వ హయాంలో కొత్తచెరువును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 82 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు పరిహారం అందకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు శుక్రవారం రైతుల ఖాతాల్లో పరిహారం నగదు జమ అయ్యింది. ఏళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరగడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.