ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్ ఏపీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? అనేది డైలమాలో పడింది. ఇప్పుడు పవన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.
Pawan is back: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ముఖ్యంగా OG షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే రీసెంట్గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో.. వెంటనే ఏపీలో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపొయింది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఉస్తాద్ సెట్స్ నుంచే పవన్ ఏపీకి బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అనుకోకుండా పవన్ బ్రేక్ ఇవ్వడంతో.. ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ కష్టమే అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పవన్ తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో హరీష్ శంకర్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నాడట. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ సీక్వెన్స్‌ని సినిమాకే హైలెట్‌గా డిజైన్ చేశారట.
ఉస్తాద్ సంగతి పక్కన పెడితే.. హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వీలైతే పవన్, ఎలక్షన్స్ ముందు OGతో పాటు ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. హరిహర వీరమల్లు మాత్రం ఇప్పట్లో కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదలై ఏండ్లకేండ్లు గడుస్తున్నాయి. ఏదేమైనా.. ఏపీ ఎలక్షన్స్ వరకు పవన్ సినిమాల షూటింగ్ కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి.