RR: కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో రెండవ వార్డ్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి CC రోడ్డు పనులను సర్పంచ్ చందన గోవర్ధన్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.