TPT: నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం తీర్థప్రసాదాలు, ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు.