ADB: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయకులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.