సత్యసాయి: బుక్కపట్నం మండలంలో కురిసిన అకాల వర్షం, గాలులకు మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. కృష్ణాపురంలో సత్యనారాయణకు చెందిన 4 ఎకరాలు, భాస్కర్ రెడ్డికి చెందిన 3 ఎకరాల పంట నేలకొరగడంతో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముదిగుబ్బలో నూర్పిడి చేసిన వేరుశనగ పంట సైతం వర్షానికి తడిసి ముద్దయింది.