AKP: ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయం గురువారం భక్తులతో పోటెత్తింది. గంటల తరబడి భక్తులు క్యూ లైనులో నిలబడి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.