NZB: ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితుడితో పంచాంగ శ్రవణం చేయించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు గ్రామప్రజలు పాల్గొన్నారు.