TG: కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తానన్నారు. ‘డాడీ, మోడీ, చిన్న మోడీ’పైనే తన పోరాటం ఉంటుందన్నారు. సామాజిక తెలంగాణ ధ్యేయంతో సర్వోదయ తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామన్నారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.