అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. గంగిరెద్దుల సందడి మధ్య పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలతో తెలుగు సంవత్సరాదికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.