కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, సీఎం పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటలకు తలస్సేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం చేరుకున్నారు. ఆయనకు కన్నూరు రిజిస్ట్రార్ ఎబీ సత్యన్ స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి పినరయి విజయన్ అందజేశారు.