KRNL: విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య వెంకట బసవరావు అన్నారు. వేసవి కారణంగా యూనివర్సిటీ ఆవరణ ముందు పాదచారులకు ఇవాళ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజసేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రిజిస్టర్ విజయ్ కుమార్ నాయుడు హాజరయ్యారు.