»Ibomma Website That Gave Mass Warning To Telugu Industry And Star Heroes
iBomma: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఐ బొమ్మ గట్టి వార్నింగ్
ఐ బొమ్మ(ibomma) ఈ వెబ్సైట్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పవచ్చు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చే సినిమాలను.. మంచి హెచ్డీ క్వాలిటీతో ఐబొమ్మ ప్రేక్షకుల కోసం ఫ్రీగా అందిస్తోంది. అయితే తాజాగా ఈ వెబ్ సైట్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి వార్గింగ్ ఇచ్చింది. అంతేకాదు తనను గెలకొద్దని హెచ్చరించింది. అసలు మ్యాటర్ ఎంటీ? ఏం జరిగిందనేది ఇప్పుడు చుద్దాం.
అనేక రోజుల నుంచి ఐ బొమ్మ(ibomma) వెబ్సైట్ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదలైన సినిమా కంటెంట్‌ను పైరసీ చేస్తోంది. అయితే ఫ్రీగా ఇస్తుండడంతో చాలా మంది ఐబొమ్మలో చూడడానికి అలవాటు పడ్డారు. దీని కారణంగా ఓటీటీ సంస్థలకు భారీ నష్టం కలుగుతుంది. డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకని అనేక మంది ఐ బొమ్మనే ఫాలో అవుతూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఐబొమ్మపై చర్యలు తీసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.
కానీ అది విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నందున సాధ్యపడటం లేదు. ఇలా కాదని దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఇండస్ట్రీలో కొంత మంది నిర్మాతలు(producers) ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఐ బొమ్మ యాజమాన్యం సదరు నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని హెచ్చరించింది. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్స్ అమ్మిన తరవాత కెమెరా ప్రింట్స్ తీసి పైరసీ చేసే వాళ్లను వదిలేసి ఐ బొమ్మ మీద ఫోకస్ చేయడం కరెక్ట్ కాదని తెలిపింది.
అంతేకాదు అసలు టాలీవుడ్(tollywood) హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా అని ప్రశ్నించింది. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఎంటని నిలదీసింది. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ కే పోతుందని గుర్తు చేసింది. దీంతోపాటు విదేశాల్లో షూటింగ్‌లు, ట్రిప్స్‌కి పెద్ద ఎత్తున ఖర్చుపెడుతున్నారని స్పష్టం చేసింది. మరోవైపు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించింది. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. దీంతోపాటు ఇక్కడి వాళ్లకు ఉపాధి కూడా కలుగుతుంది కదా అంటూ చురకలు అంటించింది. అనవసర బడ్జెట్ పెట్టి దానిని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్లకు ఎక్కువగా అమ్మి.. దానిని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ ధరలు పెంచుతున్నారని ప్రస్తావించింది. ఈ మొత్తం ప్రక్రియలో చివరికి మధ్యతరగతి పౌరుడే నష్టపోతున్నాడని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో మా వెబ్సైట్(website) మీద ఫోకస్ చేయడం మానేయాలని సూచించింది. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. మీ యాక్షన్‌కి మా రియాక్షన్ ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియలో ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదని వెల్లడించింది. అంతేకాదు తాము ibomma.net వాళ్లంత మంచివాళ్లం కాదని గుర్తు చేసింది. బురదలో రాయి వేేయోద్దని కోరింది. ఎక్కడ ఉన్నా తాము తెలుగు వారికోసం ఆలోచిస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏ విశ్లేషకులు స్పందించలేదు. ఓటీటీని పైరసీ చేయడమే కాకుండా ఇలా వార్నింగ్ ఇవ్వడం చూసి అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.