అన్నమయ్య జిల్లా కురవకోట మండలం అంగళ్లుకు చెందిన ఇద్దరు వాలంటీర్లు (Volunteers) కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. అంగుళ్లు గ్రామ పంచాయతీ పాత ట్యాంకు వీధిలో సెబ్ అధికారులు (Seb officials) దాడులు నిర్వహించారు. అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయించడంతో పాటు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 480 టెట్రా మద్యం పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.వీరిలో ఒకరు మహిళా వాలంటీర్ ఉన్నారు. వీరిపై ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి (CI Srihari Reddy) కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం (Karnataka State) రాయలపాడుకు చెందిన ఆర్ఎస్. నడిపి రెడ్డితో పాటు అంగళ్లు గ్రామానికి చెందిన వాలంటీర్ సందీప్, అలాగే ఇదే గ్రామానికి చెందిన వాలంటీర్ అమ్మాజీ(Ammaji)లను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు (Angallu) ఇటీవలి కాలంలో బాగా పాప్యులర్ అయింది. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. . వీరి నుంచి కర్ణాటక మద్యం(Karnataka Liquor)తో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింది వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. స్థానికంగా ఉండే ఒక వైసీపీ నేత సహకారంతో వీరు మద్యం విక్రయాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.