TG: హైదరాబాద్ రవీంద్రభారతిలో పరాభవ నామ ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Tags :